స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 87 పాయింట్లు నష్టపోయి 61,663 వద్ద ముగిసింది. నిఫ్టీ 36 పాయింట్లు నష్టపోయి 18,307 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (1.11%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.99%), ఏషియన్ పెయింట్స్ (0.90%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.58%), కోటక్ బ్యాంక్ (0.41%).
టాప్ లూజర్స్ : మహీంద్రా అండ్ మహీంద్రా (-2.46%), మారుతీ (-1.57%), బజాజ్ ఫైనాన్స్ (-1.53%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.52%), ఎన్టీపీసీ (-1.52%).