బీహార్‌లోని నలందా ప్రాంతంలోని బెనా పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న వంతెన శుక్రవారం కూలిపోయింది. శిథిలాల కింద ఎంతమంది చిక్కుకుపోయారన్న దానిపై స్పష్టత లేదు. భగన్ బిఘా చౌక్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. భక్తియార్‌పూర్-రాజౌలి రహదారి నిర్మాణ పనుల్లో ఓవర్ బ్రిడ్జి చాలా భాగం కూలిపోయింది. ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa