వేటపాలెం మండలం దేశాయిపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు అదృశ్యమైనట్లు ఫిర్యాదు అందగా శనివారం ఉదయం ఎస్ఐ సురేష్ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆమోదగిరి పట్టణానికి చెందిన గోరంట్ల రవికుమార్, రామ్ నగర్ కు చెందిన వంజా ఎంబ్రి, దేశాయిపేటకు చెందిన తవిటి రాజు అనే విద్యార్థులు శుక్రవారం బడికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదని వారి తల్లిదండ్రులు తమ ఫిర్యాదుల పేర్కొన్నారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ సురేష్ వారి ఫోటోలను మీడియాకు, సోషల్ మీడియాకు విడుదల చేశారు. ఎవరికైనా వారి ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం అందించాలని ఎస్సై సురేష్ కోరారు.