బాపట్ల జిల్లా పరుచూరు నియోజకవర్గం మార్టూరు మండలం డేగరమూడి గ్రామంలో జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ శనివారం విస్తృతంగా పర్యటించారు. ఆ గ్రామంలోని జగనన్న కాలనీని సందర్శించారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లను పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడే ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకోవాలని కలెక్టర్ హితవు పలికారు
వర్మీ కంపోస్ట్ కేంద్రాన్ని కూడా ఆమె పరిశీలించారు. గ్రామాలలో పారిశుద్యాన్ని మెరుగుపరచాలని, చెత్త సంపద కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆమె అధికారులకు సూచించారు. సచివాలయం సిబ్బందితో కలెక్టర్ సమావేశమై వారి విధులు బాధ్యతలను నిర్దేశించారు. ప్రతి అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. విధి నిర్వహణలో ఉదాసీనత ప్రదర్శించే వారిపై కఠిన చర్యలు తప్పవని అమె హెచ్చరించారు. పలువురు జిల్లా, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది కలెక్టర్ వెంట ఉన్నారు.