ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖమేనీ మాస్కోలో ఉన్నారన్న వార్తలు ఫేక్.. ఇరాన్ సంచలన ప్రకటన!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 17, 2026, 08:43 PM

ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల్లో కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడినట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. దీంతో ఆయన చికిత్స కోసం రష్యా రాజధాని మాస్కోకు తరలించబడ్డారని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.అదే సమయంలో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా ఖమేనీని ఆహ్వానించినట్లు కూడా ప్రచారం జరిగింది. ఈ వార్తల నేపథ్యంలో ఇరాన్ అధికారికంగా స్పందించింది.రష్యాలోని ఇరాన్ రాయబారి కాజెమ్ జలాలీ మాట్లాడుతూ, ఖమేనీ రష్యాలో ఉన్నారన్న వార్తలు పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. ఈ ప్రచారం అంతా మానసిక యుద్ధానికి భాగమని ఆయన పేర్కొన్నారు.అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ముందు కూడా సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ రష్యా, వెనెజువెలాలకు వెళ్లేందుకు ప్రయత్నించారన్న తప్పుడు వార్తలు వచ్చాయని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు మొజ్తబా ఖమేనీపై కూడా అదే తరహా ప్రచారం జరుగుతోందని విమర్శించారు.“మా దేశ నాయకులు ఎక్కడికో పారిపోయి దాక్కోవాల్సిన అవసరం లేదు. వారు ప్రజల మధ్యే ఉంటారు,” అని కాజెమ్ జలాలీ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ విషయంపై రష్యా అధికార ప్రతినిధి మాత్రం స్పందించడానికి నిరాకరించారు.ఇదిలా ఉండగా, అయతుల్లా అలీ ఖమేనీ మరణానంతరం మొజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అయితే యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఆయన బహిరంగంగా కనిపించలేదు. మరోవైపు, ఈ దాడుల్లో ఆయనకు గాయాలయ్యాయని అమెరికా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఆయన చికిత్స కోసం రష్యాకు వెళ్లారన్న వార్తలు వైరల్ అయ్యాయి.ఈ నేపథ్యంలో ఇరాన్ రాయబారి స్పందిస్తూ, ఈ కథనాలన్నీ నిరాధారమని మరోసారి స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa