బెంగళూరు లోని ఓ కేఫ్ లో "గ్యాస్ క్రైసిస్ ఛార్జ్" పేరిట 5% ఎక్స్ ట్రా వసూలు చేసిన యాజమాన్యం.నిమ్మరసానికి గ్యాస్ ఛార్జ్ ఏంటి.?!! అంటూ.. ఆగ్రహం వ్యక్తం చేసిన కస్టమర్లు. బిల్లు ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.ఫోటో వైరల్ కావడంతో హోటల్ యాజమాన్యం పై ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తూ విమర్శలు చేసిన నెటిజన్లు..స్పందించిన రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు మరియు వినియోగదారుల హక్కుల కమిషన్.. వివరణ కోరుతూ నోటీసులు జారీ.నిమ్మకాయ జ్యూస్ తయారీలో గ్యాస్ వినియోగం తక్కువగా ఉండే సందర్భంలో ఇలాంటి ఛార్జ్ విధించడం ఏమిటని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది వేగంగా వైరల్ అయింది. అనేక మంది నెటిజన్లు ఈ చర్యను తప్పుబట్టారు. కొందరు హోటల్ యాజమాన్యం అనవసరంగా కస్టమర్లపై భారం మోపుతోందని విమర్శించగా, మరికొందరు ఇలాంటి చర్యలు వినియోగదారుల హక్కులకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa