కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ఉజ్వల యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్‌తో పాటు రూ.550కే గ్యాస్ సిలిండర్ అందిస్తోంది. మే 1, 2016న ప్రారంభమైన ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 12 కోట్లకుపైగా కుటుంబాలు లబ్ది పొందాయి. అర్హులైన మహిళలు, 18 ఏళ్లు నిండినవారు, షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందినవారు, రేషన్ కార్డు, అంత్యోదయ అన్న యోజన లబ్దిదారులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డ్, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో అవసరం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa