ఈవీ చార్జర్లు మరియు అనుబంధ ఉత్పత్తుల తయారీలో ప్రముఖ సంస్థ Exicom Tele-Systems హైదరాబాద్‌లో తన కొత్త సమగ్ర తయారీ ప్లాంట్‌ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్‌పై సుమారు రూ.216 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు సంస్థ సీఈవో అనంత్ నహతా వెల్లడించారు.18.4 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ ప్లాంట్ తొలి దశ ప్రారంభంతో కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం దాదాపు రెండున్నర రెట్లు పెరుగుతుందని ఆయన తెలిపారు. అలాగే ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానికంగా 750కు పైగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి.దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ఈవీ చార్జింగ్ మౌలిక వసతులు, లిథియం అయాన్ బ్యాటరీ సిస్టమ్స్, అలాగే క్రిటికల్ పవర్ సొల్యూషన్స్‌కు ఉన్న డిమాండ్‌ను తీర్చడంలో ఈ ప్లాంట్ కీలక పాత్ర పోషించనుంది.ఇందులో ట్రై-ఫ్లక్స్ లిక్విడ్ కూల్డ్ పవర్ మాడ్యూల్స్ తయారీకి ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు సంస్థ తెలిపింది. అంతేకాకుండా, దేశంలోనే తొలి ఈవీ చార్జర్ ఇంటరాపరబిలిటీ టెస్టింగ్ సెంటర్‌ను కూడా ఈ యూనిట్లో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.మొత్తంగా, ఈ కొత్త ప్లాంట్ ద్వారా ఎలక్ట్రిక్ వాహన రంగంలో సాంకేతిక పురోగతికి తోడ్పడటంతో పాటు, స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచడంలో కూడా ఎగ్జికామ్ కీలక అడుగు వేసినట్టైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa