ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనిరుధ్ మరో లెవెల్.. Universal టీంతో డీల్, రికార్డుల వర్షం!

national |  Suryaa Desk  | Published : Tue, Mar 17, 2026, 09:53 PM

ఇప్పటికే తన సంగీతంతో సంచలనాలు సృష్టిస్తున్న Anirudh Ravichander మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. ప్రపంచ ప్రఖ్యాత మ్యూజిక్ సంస్థ Universal Music Indiaతో అనిరుధ్ ఒక కీలక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోవడం విశేషంగా మారింది.ఇటీవల అనిరుధ్ ‘Albuquerque Records’ పేరుతో తన స్వంత ఇండిపెండెంట్ రికార్డ్ లేబుల్‌ను ప్రారంభించాడు. ఇప్పుడు ఈ లేబుల్, యూనివర్సల్ మ్యూజిక్ ఇండియాతో చేతులు కలపడంతో మ్యూజిక్ ఇండస్ట్రీలో కొత్త దిశకు నాంది పలికినట్టైంది. ఈ భాగస్వామ్యం ద్వారా ముఖ్యంగా పాప్, హిప్-హాప్ మ్యూజిక్‌పై దృష్టి పెట్టనున్నారు.ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా అనిరుధ్ తన ఇండిపెండెంట్ మ్యూజిక్ ప్రాజెక్ట్స్‌తో పాటు కొత్త ఆర్టిస్టులను కూడా ప్రోత్సహించనున్నారు. ఈ లేబుల్ నుంచి విడుదల కానున్న తొలి ప్రాజెక్ట్ అనిరుధ్‌దే కావడం ప్రత్యేకతగా నిలిచింది. ఇది ఏప్రిల్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశముంది.ఇండిపెండెంట్ మ్యూజిక్ రంగంలో కొత్త అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా ఈ భాగస్వామ్యం కుదిరింది. పాప్, హిప్-హాప్ సింగర్స్‌కు ఇది ఒక మంచి వేదికగా మారనుంది.అనిరుధ్ సంగీత ప్రయాణం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 2012లో విడుదలైన Why This Kolaveri Di పాటతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయన, అప్పటి నుంచి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటివరకు 770కి పైగా పాటలతో 13 బిలియన్లకు పైగా ఆడియో స్ట్రీమ్స్ సాధించి రికార్డు సృష్టించారు. Spotifyలో అత్యధిక స్ట్రీమ్స్ కలిగిన సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్‌గా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.‘Hukum’, ‘Vaathi Coming’, ‘Arabic Kuthu’ వంటి గ్లోబల్ హిట్స్‌తో పాటు అనేక చిత్రాలకు అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించి మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగారు.ఇప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్ రంగంలోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ మ్యూజిక్‌ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా ఈ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాంతంలో భారీ ఫాలోయింగ్ ఉన్న అనిరుధ్‌తో జట్టుకట్టడం వెనుక ఇదే ప్రధాన కారణంగా భావిస్తున్నారు.తన ‘Albuquerque Records’ ద్వారా భారతీయ ఇండిపెండెంట్ టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలనేది తన లక్ష్యమని అనిరుధ్ తెలిపారు. పాప్, హిప్-హాప్ మ్యూజిక్‌లో అనుభవం ఉన్న యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా సరైన భాగస్వామి అని చెప్పారు. ఈ భాగస్వామ్యం కొత్త తరానికి చెందిన ఆర్టిస్టులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంలో కీలకంగా మారనుంది.ఈ సందర్భంగా యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా చైర్మన్ & సీఈఓ దేవరాజ్ సన్యాల్, భారతీయ సంగీత భవిష్యత్తు అనిరుధ్ వంటి ప్రతిభావంతుల చేతుల్లోనే ఉందని ప్రశంసించారు. అలాగే మేనేజింగ్ డైరెక్టర్ సనుజీత్ భుజబల్ కూడా అనిరుధ్ ప్రత్యేకమైన మ్యూజిక్ స్టైల్, అతని ఫ్యాన్‌బేస్ గురించి ప్రశంసలు కురిపించారు.మొత్తానికి సినిమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు ఇండిపెండెంట్ మ్యూజిక్ రంగంలో కూడా తన ముద్ర వేయడానికి అనిరుధ్ సిద్ధమయ్యాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa