గత కొన్నేళ్ల నుంచి మలేషియాలో రాజకీయ అస్థిరత నెలకొన్న విషయం తెలిసిందే. నేడు ఆ దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం, వాతావరణ మార్పులు ఈసారి ఎన్నికల్లో కీలక అంశాలు కానున్నాయి. మలేషియా పార్లమెంట్లో మొత్తం 222 సీట్లు ఉన్నాయి. వాటి కోసం దాదాపు వెయ్యికి మందిపైగా పోటీపడుతున్నారు. 15వ జనరల్ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది.