సుప్రీంకోర్టులో ఉపయోగించే భాష ఆంగ్లమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. శుక్రవారం వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై తన వాదనలు హిందీలో వినిపించిన శంకర్ లాల్ శర్మ అనే కక్షిదారునికి ఈ విషయం తెలిపింది. అయితే కోర్టు ఏం చెబుతుందే అర్థం కాకపోవడంతో ఓ న్యాయవాదిని కేటాయించాలని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్ లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ డిసెంబర్ 4కు వాయిదా వేసింది.