మతం మారలేదని ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసేందుకు యత్నించిన ఘటన కర్ణాటక చిత్రదుర్గలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిత్రదుర్గకు చెందిన అబ్దుల్ ఖాదర్ శివమొగ్గకు చెందిన ఉమాను ప్రేమించి మతాంతర వివాహం చేసుకున్నాడు. అనంతరం మతం మారాలని ఆమెపై ఒత్తిడి తీసుకురాగా ఆమెకు మనో వేదనతో కాళ్లు పని చేయలేదు. అయినా ఆమెను చిత్ర హింసలు పెట్టి గొంతు నులిమి చంపేందుకు యత్నించాడు. దీనిపై బంధువు సాయంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా నిందితున్ని అరెస్ట్ చేశారు.