ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ప్రభుత్వ పరంగా చేయూతనందిస్తున్నట్లు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నడుస్తున్న భవితా కేంద్రాలలో గల ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపకరణాలను ఉచితంగా పంపిణీ చేశారు. నెల్లూరు నగరంలో జిల్లా పరిషత్ ప్రాంగణంలో శనివారం ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు సంబంధించి ఇలాంటి అత్యున్నత కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. చిన్న చిన్న లోపాలతో పుట్టిన పిల్లలకు చేయూతనివ్వాల్సిన అవసరం ఉందనిన్నారు. వారు కూడా సమాజంలో సాధారణ వ్యక్తుల్లా జీవనం సాగించేందుకు ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు వైద్య శిబిరాలు, శాస్త్ర చికిత్సలతో పాటు ఉచితంగా ఉపకరణాలను అందిస్తున్నామన్నారు.