ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవంతి ఇటలీ రాజధాని రోమ్ నగరంలో ఉంది. లుదోవిసీ కుటుంబానికి చెందిన ఈ భవంతి దాదాపు 70 ఎకరాల ప్రాంగణంలో 30 వేల చదరపు అడుగులు విస్తరించి ఉంది. పదహారో శతాబ్దం నాటి ఈ భవన ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఈ భవంతికి 53,900 కోట్ల డాలర్లు (రూ. 44.31 లక్షల కోట్లు) ఉంటుందని అధికారుల అంచనా. దీన్ని వేలం వేయగా ఎవరూ కొనేందుకు ముందుకు రాలేదు. చివరకి ఆ దేశ ప్రభుత్వం సైతం వెనకడుగువేసింది.