ఘజియాబాద్‌లోని కౌశాంబిలో రాడిసన్ బ్లూ హోటల్ యజమాని అమిత్ జైన్ శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. తూర్పు ఢిల్లీలోని తన నివాసంలో ఉరి వేసుకుని తనువు చాలించాడు. దీనిపై మండవాలి పోలీస్ స్టేషన్‌కు ఫోన్ కాల్ రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. ఆత్మహత్యకు సంబంధించి ఆయన లేఖ ఏదీ రాయలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.