ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో మంజూరైన పక్కాగృహాలను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా పశుసంవర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్, మండల ప్రత్యేకాధికారి మహేశ్వరుడు కోరారు. ఆదివారం ఆయన మండలంలోని తరుణవాయిలో జరిగిన ‘ఆవాస్ దివస్’ కార్యక్రమంలో పాల్గొని, మాట్లాడుతూ పీఎంఏవై గృహ నిర్మాణాలపై దిశా నిర్ధేశం చేసి, లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హౌసింగ్ డీఈ నటరాజన్, ఏఈ కరీముల్లా, వైసీపీ మండల కన్వీనర్ శంకర్‌రెడ్డి, మాజీ కన్వీనర్ రఘునాథ్‌రెడ్డి, సర్పంచు బాలనాయుడు, వైసీపీ నాయకులు తుంగా దయాకర్‌రెడ్డి, కోటా రెడ్డి లబ్ధిదారులు పాల్గొన్నారు.