ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామలో ఎన్ఆర్ఐ మహిళ అదృశ్యం కలకలం రేపుతోంది. నందిగామ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ మహిళ.... అక్టోబర్ 29న అమెరికా నుంచి ఇండియాకు వచ్చింది. సదరు మహిళ అమెరికాలో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. కాగా... ఈనెల 18న ఉదయం 11 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఎన్ఆర్ఐ మహిళ ఆపై కనిపించకుండా పోయింది. ఆటోలో నందిగామ బస్టాండుకు చేరుకుని అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో విజయవాడ వెళ్ళినట్లు సమాచారం. మహిళ ఆచూకీ తెలియకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ తన ఫోన్ను ఇంటి వద్ద వదిలి పాస్ట్పోర్టుతో వెళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.