ద్వైపాక్షిక ప్రోటోకాల్‌కు అనుగుణంగా, పొరుగు దేశంలోని అనేక మతపరమైన ప్రదేశాలకు వెళ్లాలనుకునే భారతీయ యాత్రికులకు పాకిస్తాన్ 100 వీసాలను జారీ చేసింది.నవంబర్ 22 నుంచి డిసెంబర్ 3 వరకు సింధ్ ప్రావిన్స్‌లోని షాదానీ దర్బార్ హయత్ పితాఫీలో శివ అవతారి సద్గురు సంత్ షదరాం సాహిబ్ 314వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు భారత యాత్రికుల బృందం పాకిస్థాన్‌కు వెళ్లనున్నట్లు పాక్ హైకమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.