ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఈ నెల 23న శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూమి హక్కులు, భూ పరిరక్షణ (పునర్సర్వే) కార్యక్రమం రెండో దశను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. సీఎం జగన్ ఈ నెల 23న ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు నరసన్నపేటకు చేరుకుంటారు. బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూమి హక్కులు, భూ పరిరక్షణ పథకం లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేస్తారు.