రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వికలాంగుల పింఛన్ వేరిఫికేషన్ కార్యక్రమం పంచాయతీ కార్యదర్శులు చెపడుతున్నట్లు ఎర్రగొండపాలెం ఎంపిడిఓ సుబ్బరాయుడు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలో మొత్తం 2 వేల వరకు వికలాంగుల పింఛన్లు ఉన్నాయన్నారు. దొంగ సర్టిఫికేట్ పెట్టి కొంత మంది పింఛన్ పొందుతున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ వేరిఫికేషన్ జరుగుతుందన్నారు. కావున వికలాంగులు సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa