ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా క్లయింట్ కు డ్రైఫ్రూట్స్ అందించడంలేదు

national |  Suryaa Desk  | Published : Wed, Nov 23, 2022, 02:16 AM

ఇటీవల తీహార్ జైలులో ఢిల్లీ మంత్రి రాజబోగాలపై వివాదం చెలరేగగా మరో ఆసక్తికర పిటీషన్ కోర్టు ముందుకు చేరింది. ఇదిలావుంటే తీహార్ జైలులో రాజభోగాలు అనుభవిస్తున్నారంటూ ఢిల్లీ 'ఆప్' మంత్రి సత్యేంద్ర జైన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జైలు గదిలో మంత్రి మసాజ్ చేయించుకుంటున్న ఓ వీడియో ఇటీవల వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అయితే, ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారని మంత్రిని ఆమ్ ఆద్మీ పార్టీ వెనకేసుకువచ్చింది. తాజాగా, ఆ వీడియోలో మంత్రితో పాటు కనిపించింది ఫిజియో థెరపిస్ట్ కాదని, అదే జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ అని బయటపడింది. ఈ క్రమంలోనే మంత్రి సత్యేంద్ర జైన్ తనకు డ్రై ఫ్రూట్స్ ఇప్పించాలంటూ కోర్టుకెక్కడం సంచలనంగా మారింది.


మంత్రి సత్యేంద్ర జైన్ తరఫున ఆయన లాయర్ సోమవారం కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. జైలు అధికారులు తన క్లయింట్ ను ఆకలితో మాడ్చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. గత ఆరు నెలలుగా జైలులోనే ఉంటున్న తన క్లయింట్.. తన మత విశ్వాసాలకు అనుగుణంగా ఉపవాసం చేస్తున్నారని చెప్పారు. ఆరు నెలలుగా డ్రైఫ్రూట్స్, పళ్లు, సలాడ్ లనే ఆహారంగా తీసుకుంటున్నారని చెప్పారు.


తీహార్ జైలులోని మిగతా ఖైదీల మాదిరిగా, జైలు నిబంధనలకు లోబడి తన క్లయింట్ డ్రైఫ్రూట్స్ కొనుగోలు చేసుకుంటున్నారని జైన్ లాయర్ వివరించారు. అయితే, గడిచిన 12 రోజులుగా జైలు అధికారులు డ్రైఫ్రూట్స్ అందించడం లేదని, తన క్లయింట్ ను ఆకలితో మాడ్చేస్తున్నారని ఆరోపించారు. తన క్లయింట్ సత్యేంద్ర జైన్ ఉపవాసం కొనసాగించుకునేందుకు వీలుగా, ఆయనకు డ్రైఫ్రూట్స్ అందించేలా జైలు అధికారులను ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com