ఇటేవలే ట్విట్టర్, మెటా, అమెజాన్ ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి దిగ్గజ సంస్థ గూగుల్ చేరింది. కంపెనీపై ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు సుమారు 10 వేల మంది ఉద్యోగులను తొలగించాలని గూగుల్ నిర్ణయించినట్లు సమాచారం. ఉద్యోగుల పనితీరు ఆధారంగా గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఉద్యోగుల్లో 6 శాతం మందికి ఉద్వాసన పలికేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.