బెజవాడ రైల్వేయార్డ్లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బ్లేడ్ బ్యాచ్ ముఠా హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం అదే ప్రాంతంలో గంజాయి ముఠా సభ్యుడి హత్య జరిగింది. నైజాంగేటు సిగ్నల్ అండ్ టెలికాం కార్యాలయం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు మృతదేహాన్ని గుట్టుగా పోస్టుమార్టానికి తరలించారు. ఆరు నెలల వ్యవధిలో నైజాంగేట్ ప్రాంతంలో మూడు హత్యలు జరిగింది. వరుస హత్యలతో నైజాంగేట్ వాసులు బెంబేలెత్తుతున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు కోసం స్థానికుల నుంచి పోలీసులు రూ.లక్షలు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ప్రతి ఇంటి నుంచి రూ.2 వేల చొప్పున వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై పోలీసులు స్పందించడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.