ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి అగ్ని-3 మధ్యంతర శ్రేణి క్షిపణి పరీక్షను భారత్ బుధవారం విజయవంతంగా నిర్వహించినట్లు డీఆర్ డీవో వర్గాలు వెల్లడించాయి. సాధారణ సైనిక శిక్షణ ప్రయోగాల్లో భాగంగా ఈ బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ క్షిపణి అణు వార్ హెడ్ తీసుకెళ్లి.. 3,500 కి.మీ లక్ష్యాలను కూడా ఛేదించగలదు. 2006 జూన్ 9న తొలిసారి అగ్ని-3 క్షిపణి మొదటి శ్రేణి ప్రయోగించగా విఫలమైంది. 2007లో రెండో క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa