లిక్కర్ స్కామ్‌లో సీఎం జగన్మోహన్‌రెడ్డి పాత్ర, తనపాత్ర బయటపడకూడదనే ఎంపీ విజయసాయిరెడ్డి ఫోన్ పోయిందని నాటకాలు ఆడుతున్నారని, ఈడీ అధికారులు అసలు దొంగల గుట్టురట్టు చేయాలని ఎమ్మెల్సీ, టీడీపీ గన్నవరం ని యోజకవర్గ ఇన్‌చార్జి బచ్చుల అర్జునుడు డిమాండ్ చేశారు. పొట్టిపాడు, తేలప్రోలు గ్రామాల్లో బుధవారం గ్రామచైతన్య కార్యక్రమంలో అర్జునుడు పాల్గొన్నారు. తేలప్రోలులో ఆయన మాట్లాడారు. ‘‘తప్పుచేయడం, తప్పుడు ఆధారాలతో తప్పించుకోవాలని చూడడం విజయసాయిరెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. లిక్కర్‌స్కామ్‌నుం చి బయటపడటానికి తన క్రిమినల్ తెలివితేటలు ఉపయోగిస్తూ ఫోన్ పోయిందని నాటకాలు ఆడుతున్నారు. లిక్కర్ స్కామ్ బయటపడ్డాక విజయసాయిరెడ్డి ఫో న్ పోవడంలో ఆంతర్యమేమిటో ప్రజలు గమనిస్తున్నారు. పోయిన ఫోన్‌లో శరత్‌చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డిల లావాదేవీలు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లావాదేవీలు, ఇతర నిగూఢ అంశాలు దాగుండబట్టే ఆ ఫోన్‌ని జగన్ తాడేపల్లి ప్యాలెస్ నేలమాళిగలో దాచి ఉంటారు.’’ అని అర్జునుడు అనుమానం వ్యక్తంచేశారు. తాడేపల్లి ప్యా లెస్ వీఐపీలు, పాలకులు ఉండే ప్రదే శం.. అక్కడేమైనా దొంగలున్నారా? అని ప్రశ్నించారు. తన అల్లుడిని ఈడీ విచారిస్తున్నప్పుడే విజయసాయి ఫోన్ పోవడం ముమ్మాటికీ తాడేపల్లి ప్యాలెస్ రహస్యమేనన్నారు. వడ్రాణం హరిబాబు, ఆరుమళ్ల వెంకటకృష్ణారెడ్డి, ఆళ్ల హనోక్, ఆళ్ల గోపాలకృష్ణ, సూర్యం, వెంకటరెడ్డి పాల్గొన్నారు.