ఒడిశా కేంద్రపార జిల్లా బాలియా బజార్ లో ఘోర ప్రమాదం జరిగింది. కార్తీకేశ్వర స్వామి నిమజ్జన కార్యక్రమంలో బాణాసంచా పేలి 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. పూజా వేదికల వద్ద బాణాసంచా కాలుస్తుండగా.. ఓ నిప్పురవ్వ మందుగుండు నిల్వ ఉన్న సంచిలో పడడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa