కమలాపురం మండలం విభరాపురం గ్రామంలో పుత్త పెద్ద ఎల్లారెడ్డిపై అతన్ని సమీప బంధువు వరుసకు అల్లుడు అయ్యే శివప్రసాద్ రెడ్డి శుక్రవారం ఉదయం కత్తితో దాడి చేశారు. గురువారం రాత్రి 2 గంటల సమయంలో హైదరాబాదు నుండి ద్విచక్ర వాహనంలో గ్రామానికి శివప్రసాద్ రెడ్డి చేరుకున్నారు. ఇంట్లో ఉన్న నగదు బంగారం ఇవ్వాలంటూ లేదంటే చంపేస్తానని కత్తితో దాడి చేసినట్లు బంధువులు తెలిపారు. పెద్ద ఎల్లారెడ్డి కేకలు వేయడంతో పక్క రూమ్ లో ఉన్న ఆయన భార్య ఈ కేకలు విని రావడంతో ఆమె పైన కూడా కర్రతో దాడి చేయడం జరిగింది. ఈ కేకలు విని గ్రామస్తులు రావడంతో శివప్రసాద్ రెడ్డి పరారు అయ్యారు. పెద్ద ఎల్లారెడ్డిని, ఆయన భార్యను కడప రిమ్స్ కు 108 ద్వారా తీసుకెళ్లారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపినట్లు బంధువులు చెప్పారు. సంఘటన స్థలాన్ని స్థానిక ఎస్సై పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.