వచ్చే నెల 8న విజయవాడలో వైసీపీ భారీ ఎత్తున బీసీ సభ నిర్వహించబోతోంది. ఎన్నికల నేపథ్యంలో వైసీపీ బీసీలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈరోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బీసీ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లోబోయిన వేణుగోపాల్ మాట్లాడుతూ బీసీ సభకు ముఖ్యమంత్రి జగన్ కూడా హాజరయ్యే అవకాశం ఉందన్నారు. బీసీల జీవన విధానంలో మార్పులు తీసుకురావాలని జగన్ డిక్లరేషన్ ప్రకటించారన్నారు.