కాంగ్రెస్ పార్టీ భారత్ జోడోయాత్ర ఘనంగా కొనసాగుతోంది. రాహుల్ గాంధీ ఈ యాత్రలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నేడు భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో కొనసాగుతోంది. వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రాహుల్ పాదయాత్రలో పాల్గొంటున్నారు. కాగా, నేడు భారత్ జోడో యాత్రలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ సైక్లిస్ట్ ఇచ్చిన సైకిల్ ను రాహుల్ గాంధీ ఉత్సాహంగా తొక్కారు. సెక్యూరిటీ సిబ్బంది, పార్టీ నేతలు పక్కనే పరుగెడుతుండగా రాహుల్ సైకిల్ తొక్కారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.