ఏపీలో దిగువస్థాయి నుంచి తూర్పు, ఈశాన్య గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రానున్న 2 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకటి, 2 చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు డిసెంబర్ 3 లేదా 4 తేదీల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్ సముద్రానికి ఆనుకుని అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. అనంతరం అది వాయవ్యదిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది.