ప్రఖ్యాత స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్మీ భారతీయ మార్కెట్లో తన స్థిరమైన స్థానం సంపాదించి, ముఖ్యంగా యువతను ఆకర్షిస్తోంది. తక్కువ ధరలో అత్యుత్తమ ఫీచర్స్ అందించటం ద్వారా వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకున్న రియల్మీ, 2018 నుండి భారత మార్కెట్లో విస్తృత శ్రేణిలో ఫోన్లను విడుదల చేస్తూ ఇతర ప్రముఖ బ్రాండ్లకు సవాలు ఇచ్చి.తాజాగా రియల్మీ P సిరీస్‌లో కొత్త బడ్జెట్ ఫోన్ P4 లైట్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఇది భారీ బ్యాటరీ బ్యాకప్, స్మూత్ డిస్ప్లే, రోజువారీ వినియోగానికి సరిపడే పనితీరుతో, విద్యార్థులు మరియు బడ్జెట్ వినియోగదారులకు ప్రత్యేక ఎంపికగా మారింది.ధర విషయానికి వస్తే, బేస్ వేరియంట్ సుమారు రూ. 9,999 నుండి ప్రారంభమవుతుంది. బ్యాంక్ ఆఫర్లు, కూపన్లు, లాంచ్ డిస్కౌంట్లతో ఈ ఫోన్ సుమారు రూ. 7,999లో కూడా పొందవచ్చు. ఫిబ్రవరి 24 నుండి Flipkart మరియు రియల్మీ అధికారిక వెబ్సైట్లో సేల్ ప్రారంభమవుతుంది. ప్రీ-ఆర్డర్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
*ఫీచర్స్:
-బ్యాటరీ & పనితీరు:P4 లైట్లో 6300mAh భారీ బ్యాటరీ ఉంది, ఒకసారి ఛార్జ్ చేసిన తర్వాత రోజంతా సులభంగా ఉపయోగించవచ్చు. 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో, డైలీ యాప్‌లు, సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్ వంటి పనులు సులభంగా చేయవచ్చు. ఆప్టిమైజ్డ్ ప్రాసెసర్ స్మూత్ పనితీరును అందిస్తుంది.
-డిస్ప్లే & డిజైన్:ఫోన్లో 6.74 అంగుళాల HD+ డిస్ప్లే మరియు 90Hz రిఫ్రెష్ రేట్ ఉంది. స్క్రోలింగ్, గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ అనుభవం స్మూత్‌గా ఉంటుంది. పెద్ద స్క్రీన్‌తో ఆన్లైన్ క్లాసులు, వీడియోస్, గేమింగ్‌కు మరింత సౌకర్యవంతమైన అనుభవం అందిస్తుంది.
-కలర్స్:బీచ్ గోల్డ్, బ్లాక్, సీ బ్లూ అనే మూడు ఆకర్షణీయమైన కలర్స్‌లో ఫోన్ అందుబాటులో ఉంటుంది.
-కెమెరా:వెనుక 13MP మెయిన్ కెమెరా, ఫ్రంట్‌లో 5MP కెమెరా ఉంది. AI కెమెరా మోడ్, నైట్ మోడ్, పోర్ట్రెయిట్ ఫీచర్ల ద్వారా సాధారణ ఫోటోగ్రఫీ అవసరాలను సులభంగా తీర్చవచ్చు.
*ఇతర ఫీచర్స్:
-4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ (మెమరీ ఎక్స్‌పాంషన్ సపోర్ట్)
-సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
-IP54 వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్
-ఆండ్రాయిడ్ 15 ఆధారిత UI
డ్యూయల్ సిమ్, 4G కనెక్టివిటీ, బ్లూటూత్, వై-ఫై సపోర్ట్తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ అందిస్తూ, P4 లైట్ బడ్జెట్ సెగ్మెంట్లో రియల్‌మీకి మరింత ప్రాముఖ్యతను మరియు మార్కెట్లో ముద్రను పెంచే అవకాశం కల్పిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa