మహాత్మా బసవేశ్వర 893వ జయంతిని పురస్కరించుకొని కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సెట్కూర్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి బసవేశ్వర చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన చూపిన సమానత్వం, సామాజిక న్యాయం మార్గం నేటి సమాజానికి మార్గదర్శకమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సంఘాల నాయకులు, సెట్కూర్ అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa