అనంతగిరిలోని చిలకలగెడ్డ గ్రామంలో సోమవారం మండల ప్రధాన కార్యదర్శి నరేంద్ర ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సివేరి అబ్రహం మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ప్రజాసేవను జీవిత లక్ష్యంగా తీసుకొని, క్రమశిక్షణ, కఠోర శ్రమ, విలువలతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన నాయకుడని కొనియాడారు. ఆధునిక సాంకేతిక వినియోగంలో దేశానికి మార్గదర్శకుడిగా నిలిచి అందరికీ ఆదర్శంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో టిడిపి నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa