ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి కొలుసు పార్థసారథి జన్మదినం: కూటమి నాయకుల మజ్జిగ పంపిణీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 18, 2026, 04:05 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి జన్మదినాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి వేణుగోపాల స్వామి గుడి వద్ద కూటమి నాయకులు పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలుగు నాయి బ్రాహ్మణ సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఆకునూరు సుబ్బారావు మాట్లాడుతూ, మంత్రి కొలుసు పార్థసారథి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని, ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారని తెలిపారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రావు, అబ్రహం, మురళీకృష్ణ, మారుతి సురేష్, బాలకృష్ణ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa