ఉప్పల్ స్టేడియంలో ఇవాళ జరిగే SRH vs CSK మ్యాచ్ కోసం పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. 2000 మంది పోలీసులు, 430 సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేపట్టారు. ప్రేక్షకులు మధ్యాహ్నం 4:30 గంటల నుంచి స్టేడియంలోకి అనుమతిస్తారు. ల్యాప్‌టాప్‌లు, బ్యాగులు, గాడ్జెట్లు, వాటర్ బాటిల్స్, సిగరెట్లు, లైటర్లు, పదునైన వస్తువులు, బ్యానర్లు స్టేడియం లోపలికి నిషేధించబడ్డాయి. క్లాక్ రూమ్ సౌకర్యం లేదని, వస్తువులను ఇంటి వద్దే వదిలి రావాలని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa