ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో ముస్లీంలకు ఆర్థిక సాయం అందజేస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 18, 2026, 03:44 PM

 మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ముస్లిం సోదరులకు త్వరలోనే ఆర్థిక సాయం అందిస్తామని, అమరావతిలో హజ్ భవనం నిర్మిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గన్నవరంలో హజ్ యాత్రను ప్రారంభించిన ఆయన.. ఇమాం, మౌజంలకు ఆర్థిక సాయం అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1987 మంది హజ్ యాత్రకు వెళ్తుండగా, విజయవాడ పరిసరాల నుంచి 353 మంది వెళ్తున్నారని తెలిపారు. హజ్ యాత్రకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించడంతో పాటు అన్ని సదుపాయాలు కల్పించడం దీనికి నిదర్శనమని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa