ఈ మధ్యకాలంలో చాలామంది యాంటీబయాటిక్స్ ని వ్యసనంగా మార్చుకున్నారు. చిన్నపాటి జ్వరం వచ్చినా వైద్యుడిని సంప్రదించకుండానే యాంటీబయాటిక్స్ మింగేస్తున్నారు. అయితే, వీటిని అధికంగా తీసుకునే చాలా ప్రమాదమని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) హెచ్చరించింది. జ్వరం 100.4 నుంచి 102.2 డిగ్రీలలోపు ఉంటే వాటిని వాడొద్దని సూచించింది. దగ్గు, శ్లేష్మం, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చలి, కొద్దిపాటి జ్వరం వంటి బ్రాంకైటిస్ లక్షణాలకు కూడా యాంటీబయాటిక్స్ వాడకంలో జాగ్రత్త వహించాలని పేర్కొంది. యాంటీబయాటిక్స్ సూచించే విషయంలో వైద్యులు కూడా జాగ్రత్త వహించాలంది.