Jasprit Bumrah: టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సమయానికి ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్లలో ఒకరు. బుమ్రా బౌలింగ్‌లో పరుగులు చేయడం సాధారణంగా చాలా కష్టమే, అయితే అతని బౌలింగ్‌లో సిక్సర్లు కొట్టడం కూడా సులభం కాదు.అయితే, ఐపీఎల్ చరిత్రలో కొన్ని బ్యాట్స్‌మెన్లు బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్లు కొట్టడం సునాయాసంగా చేశారు. ఐపీఎల్‌లో బుమ్రా బౌలింగ్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు.ఈ జాబితాలో దక్షిణాఫ్రికా దిగ్గజ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ అగ్రస్థానంలో ఉన్నారు. బుమ్రా బౌలింగ్‌లో అత్యధికంగా ఎనిమిది సిక్సర్లు కొట్టిన ఘనత ఆయనదే. డివిలియర్స్ మొత్తం 85 బంతులు ఎదుర్కొని 147.05 స్ట్రైక్ రేట్‌తో 125 పరుగులు చేశాడు.రెండో స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నారు. 101 బంతుల్లో ఆరు సిక్సర్లతో 150 పరుగులు చేసిన కోహ్లీ, బుమ్రాపై తన నిలకడతో మంచి రికార్డును కొనసాగించారు. ఐపీఎల్‌లో బుమ్రాపై అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కూడా కోహ్లీ గుర్తింపు పొందారు.మూడో స్థానంలో జేపీ డుమిని ఉన్నారు. 33 బంతుల్లో ఆరు సిక్సర్లతో 70 పరుగులు చేసి, బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు.చివరి స్థానంలో ఉన్న వారు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్. నిజానికి కమిన్స్ ఒక బౌలర్ అయినప్పటికీ, 34 బంతుల్లో ఐదు సిక్సర్లతో 54 పరుగులు చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa