క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్‌పై ఒకే ఓవర్లో వరుసగా 6 సిక్స్‌లు కొట్టిన మధుర క్షణాలు క్రికెట్ అభిమానులందరికీ గుర్తుండి పోతోంది. అయితే భారత క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ ఓ అడుగు ముందుకు వేశాడు. ఒకే ఓవర్లో వరుసగా 7 సిక్స్‌లు బాదేశాడు. యూపీతో విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర ఓపెనర్ అయిన రుతురాజ్ అరుదైన ఘనత సాధించాడు. యూపీ బౌలర్ శివ సింగ్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో రుతురాజ్ 43 పరుగులు పిండుకున్నాడు. బౌలర్ 5వ బంతిని నో బాల్ వేయడం, దానికి ఫ్రీ హిట్ లభించడంతో రుతురాజ్ అన్ని పరుగులు సాధించాడు. ఈ వీడియోను బీసీసీఐ సోమవారం ట్విట్టర్లో షేర్ చేసింది.