రాష్ట్రస్థాయి టెక్ పేస్టులో పులివెందుల లయోలా పాలిటెక్నిక్ మైనింగ్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను చాటుకున్నారని కళాశాల ప్రిన్సిపల్ ఫాదర్ బ్రిటన్ తెలిపారు. సోమవారం లయోలా కళాశాలలో ఆయన మాట్లాడుతూ. రాష్ట్రస్థాయి మూడో బహుమతి పొందిన వారిని అభినందించారు. ఈ నెల 24 నుండి 26 వరకు విజయవాడలో పాలిటెక్ ఫెస్ట్ 2022 పోటీలలో లయోలా పాలిటెక్నిక్ మైనింగ్ విద్యార్థులు పాల్గొని ఈ ఘనత సాధించారు. ఈటెక్ పేస్టులో రాష్ట్రంలోని వివిధ పాలిటెక్నిక్ కళాశాలల నుండి సుమారు 273 ప్రాజెక్టులు ప్రదర్శించారు. అందులో ప్రదర్శించిన ప్రాజెక్టులలో మైనింగ్ ప్రాజెక్టు రాష్ట్రస్థాయి మూడో బహుమతిని పొందారు. ఈ సందర్భంగా రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత వీరికి విజయవాడలో బహుమతి ప్రధానం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కళాశాల యాజమాన్యం గెలుపొందిన విద్యార్థులను ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపల్ విజయ్ రాజు హెచ్ ఓ డి లు మరియు అధ్యాపక బృందం బహుమతి పొందిన మైనింగ్ విద్యార్థులు పి హేమంత్ కుమార్, ఎస్ అబ్దుల్ రజాక్ లను బహుమతితో కళాశాల యాజమాన్యం సన్మానించింది.