ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో దారుణం జరిగింది. సర్దార్పూర్ గ్రామంలో పానీపూరీ తింటున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో రియా అనే ఆరేళ్ల బాలిక మృతి చెందింది. అను (15) వెన్నుపై బలమైన గాయమైంది. అంకిత (18)కి స్వల్ప గాయాలయ్యాయి. వారితో పాటు ఉన్న తల్లి తృటిలో తప్పించుకుంది. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కారును స్వాధీనం చేసుకున్నారు.