యూపీలోని అమేథీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడంపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో ఉన్న ఆయన ఇండోర్ సమీపంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. అమేథీ నుంచి పోటీ చేయాలనే విషయంపై మరో ఏడాది తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తన దృష్టి భారత్ జోడో యాత్రపైనే ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయిన అమేథీ నియోజకవర్గంలో రాహుల్ గాంధీపై 2019 లోక్సభ ఎన్నికల్లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గెలిచారు.