కేరళలో ఆదానీ ఓడరేవు నిర్మాణానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారి ఆందోళనకారులు గత రాత్రి విళింజం పోలీస్ స్టేషన్ పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి 3 వేల మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆందోళన సమయంలో అరెస్టైన వారిలో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ దాడిలో 40 మంది పోలీసులతో పాటు పలువురు స్థానికులు సైతం తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో రూ.85 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు పేర్కొన్నారు.