ప్రముఖ ఫుట్ బాల్ క్రీడాకారుడు, పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో ఇటీవల మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌తో విడిపోయాడు. ఈ తరుణంలో ఆయనకు కళ్లు చెదిరే ఆఫర్ వచ్చింది. సౌదీ అరేబియా ఫుట్ బాల్ క్లబ్ అల్-నాసర్ నుంచి 225-మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,800 కోట్లు) ఆఫర్‌ను అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం కార్యరూపం దాల్చినట్లయితే, రొనాల్డోకు భారీగా ఆదాయం రానుంది. ఒక్కో సీజన్‌కు 75 మిలియన్ డాలర్లను రొనాల్డో ఆర్జించనున్నాడు. పియర్స్ మోర్గాన్‌తో రొనాల్డో చేసిన ఇంటర్వ్యూ కారణంగా మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌తో విడిపోవాల్సి వచ్చింది.