అధిక బరువుతో బాధపడే వారికి బొబ్బర్లు మంచి ఆహారం. బొబ్బర్లలో క్యాలరీలతోపాటు కొవ్వులు కూడా తక్కువగా ఉంటాయి. అవి బరువు తగ్గడానికి తోడ్పడుతాయి. మధుమేహులకు లో-గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగిన బొబ్బర్లు చాలా ఆరోగ్యకరం. ఇవి బ్లడ్ షుగర్ స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతాయి. బొబ్బర్లలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని ఆహారంగా తీసుకోవడంవల్ల పోషకాహార లోపంతో వచ్చే కొన్నిరకాల వ్యాధులు ధరిచేరవు. ఇవి శరీరంలో వైరస్ వ్యాప్తి చెందకుండా హానికర టాక్సిన్స్‌ను నివారిస్తాయి.