దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజరు అరుణ్‌కుమార్ జైన్ గుంతకల్లు డివిజన్లో గుత్తి నుంచి రేణిగుంట వరకు మంగళవారం పర్యటించనున్నారు. గుత్తిలో బైపాస్ లైను సామర్థ్యం పెంపుదల, మురుగునీటి శుద్ధి కర్మాగారం ప్రారంభించనున్నారు. జేటూరు - కోమలి మధ్య పలు రైల్వే పనులను ఆయన పరిశీలించనున్నారు. అలాగే తాడిపత్రి రైల్వేస్టేషన్ పరిశీలన అనంతరం కొండాపురం చేరుకుని అక్కడ నీటి ట్యాంకులు తనిఖీ చేపట్టనున్నారు. యర్రగుంట్లలో రైల్వేపార్కు, ఆర్పీఎఫ్ బ్యారక్‌లను ప్రారంభిస్తారు. అలాగే కడప రైల్వేస్టేషన్ చేరుకుని మరమ్మతులు చేపట్టిన ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఆపై కడప రైల్వేస్టేషన్‌ను పరిశీలించనున్నారు. కడపలో మధ్యాహ్నం 3.40 నుంచి 4.30 వరకు జీఎం పర్యటించనున్నారు. అనంతరం కడప, పుల్లంపేట, అనంతరాజుపేట మధ్య రైలు స్పీడ్ టెస్టు చేయనున్నారు. చివరగా రేణిగుంటలో స్థానిక ప్రతినిధులతో సమావేశమవుతారు.