టాలీవుడ్ సీనియర్ కమెడియన్, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ కుమార్తె ఫాతిమా, షేక్ షెహయాజ్ ల వివాహం గత ఆదివారం హైదరాబాదులో వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో, తమ కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమాన్ని అలీ దంపతులు నేడు గుంటూరులో ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరయ్యారు. వధూవరులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి తన ఆశీస్సులు అందించారు. ఇదిలావుంటే ఈ రిసెప్షన్ కార్యక్రమం గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులోని శ్రీ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేశారు. ఈ వివాహ విందుకు పెద్ద సంఖ్యలో ప్రముఖులు హాజరయ్యారు. పలువురు రాష్ట్ర మంత్రులు కూడా హాజరైనట్టు తెలుస్తోంది.