శ్రీలంక క్రికెట్ లో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఒకేరోజు ముగ్గురు క్రికెటర్లు వైవాహిక జీవితంలోకి ప్రవేశించారు. పథుమ్ నిస్సంక, కసున్ రజిత, చరిత్ అసలంక నేడు కొలొంబో నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో పెళ్లి చేసుకున్నారు. ఈ ముగ్గురు క్రికెటర్ల వివాహాల ఫొటోలను శ్రీలంక క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య సిరీస్ జరుగుతుండగానే ఈ క్రికెటర్లు పెళ్లి బాజాలు మోగించారు. వీరికి శ్రీలంక క్రికెట్ బోర్డు శుభాకాంక్షలు తెలియజేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa