న్యూజిలాండ్‌తో బుధవారం క్రైస్ట్ చర్చ్‌లో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా కుప్పకూలింది. 47.3 ఓవర్లలో 219 పరుగులకే ఆలౌట్ అయింది. 125 పరుగులకే టాప్ ఆర్డర్ అంతా పెవిలియన్ చేరింది. భారత జట్టులో వాషింగ్టన్ సుందర్ (51), శ్రేయస్ అయ్యర్ (49), శిఖర్ ధావన్ (28) పరుగులు చేశారు. మిగిలిన వారంతా తక్కువ స్కోరుకే ఔట్ అయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లు ఆడమ్ మిల్నే, డెరిల్ మిచెల్ 3 చొప్పున వికెట్లు తీశారు. టిమ్ సౌథీకి 2, ఫెర్గ్యూసన్, శాంట్నర్‌లకు ఒక్కో వికెట్ దక్కాయి. ఈ మ్యాచ్‌లో ఓడితే సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంది.