గతేడాది నుంచి కనిపించకుండా పోయిన చైనా దిగ్గజ పారిశ్రామికవేత్త, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా.. జపాన్‌లోని టోక్యోలో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆరు నెలల నుంచి ఆయన అక్కడే రహస్య జీవితం గడుపుతున్నట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఫైనాన్షియల్ టైమ్స్ (FT) ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. జాక్ మా టోక్యోలో ఉంటూ తరచూ అమెరికా, ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారట. వ్యక్తిగత వంట మనిషి, భద్రతా సిబ్బంది మాత్రమే ఆయన వెంట ఉంటున్నారని సమాచారం. గింజా డిస్ట్రిక్ట్ ప్రాంతంలోని ప్రైవేటు వ్యక్తుల క్లబ్బులు, ఇంపీరియల్ ప్యాలెస్‌కు ఎదురుగా ఉన్న మరునౌచీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న మరో క్లబ్.. ఇక్కడే ఆయన ఎక్కువగా సేదతీరుతున్నారని సమాచారం.